This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

మీ చర్మం మీద మొటిమలను వదిలించుకునేందుకు టాప్ 5 సహజ మార్గాలు

Pimples and Acne
Written by - Dhanlaxmi Raoచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
మీ చర్మం మీద మొటిమలను వదిలించుకునేందుకు టాప్ 5 సహజ మార్గాలు
Likes5 Likes|
Read time6 min

మొటిమలు చూసేందుకు అందవికారంగా ఉంటాయి. ఇవి మన ముఖం మీద కనిపిస్తే మనకు ఏదో కోల్పోయిన ఫీలింగ్ కలుగుతుంది. మాయో క్లీనిక్ చెప్పిన దాని ప్రకారం, OTC(ప్రస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేసే మందులు) మరియు ప్రిస్క్రిప్షన్ మందులు కూడా మొటిమలను నయం చేస్తాయి. మరలా భవిష్యత్​లో రాకుండా చేస్తాయి. కొంత మంది ఇంట్లోనే మొటిమలకు సహజ చికిత్సలను ఎంచుకుంటారు. తేలికపాటి మొటిమలను ఇంట్లో సులభంగా నయం చేయొచ్చు. క్లిష్ట పరిస్థితుల్లో నిపుణుల చికిత్స అవసరం అవుతుంది. ముఖ్యంగా సిస్ట్స్ లేదా నాడ్యూల్స్ వద్ద అవసరమవుతుంది. మీ వంటగదిలో ఉన్న వీటితో మీరు మొటిమల నివారణలను కనుక్కోవచ్చు. ఇది మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది.

1. యాపిల్ సైడర్ వెనిగర్​ను సహజ క్రిమిసంహారకలా ఉపయోగించండి..

ఫిల్టర్ చేయని యాపిల్ రసాన్ని పులియబెట్టడం వల్ల యాపిల్ సైడర్ వెనిగర్ లభిస్తుంది. ఇతర వెనిగర్స్​లాగే ఇది క్రిములను చంపవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్​లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ మరియు జింక్ ఆక్సైడ్ మొటిమలను తొలగిస్తాయని 2016లో ఒక విశ్వసనీయ సోర్స్ ప్రకటించింది. 2017లో నిర్వహించిన అధ్యయనం యాపిల్ సైడర్ వెనిగర్​లోని లాక్టిక్ యాసిడ్ మొటిమల తాలూకు మచ్చలను తగ్గించవచ్చునని తెలిపింది. యాపిల్ సైడర్ వెనిగర్ మొటిమలను మెరుగుపరుస్తుందని అంటారు. కానీ ఏ డేటా దీన్ని సపోర్ట్ చేయదు. యాపిల్ సైడర్ వెనిగర్ వాడడం వల్ల చర్మానికి చికాకు కలుగుతుందని డెర్మటాలజిస్ట్ (చర్మ సంబంధిత నిపుణులు) హెచ్చరిస్తున్నారు.

  • ఒక భాగం ACV(యాపిల్ సైడర్ వెనిగర్) మూడు వంతుల నీళ్లు (సున్నితమైన చర్మం ఉన్న వారు ఎక్కువ నీటిని కలుపుకోవాలి)
  • ఆ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి చర్మం మీద శుభ్రం చేయండి.
  • 5-20 సెకండ్ల వరకు ఇలాగే చేయండి. ఆ తర్వాత కడిగి ఆరబెట్టండి.
  • అవసరమైన విధంగా ప్రతి రోజు ఇలాగే పునరావృతం చేయండి.

2. జింక్ సప్లిమెంట్లను తీసుకోండి..

కణజాలాల అభివృద్ధి, హార్మోన్ సింథసిస్ (సంశ్లేషణ), జీవక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడంలో జింక్ సహాయపడుతుంది. ఇతర మొటిమల చికిత్సలతో పోలిస్తే ఇది బాగా స్టడీ చేయబడింది. 2020 మెటా విశ్లేషణ ప్రకారం జింక్ చికిత్స పొందిన రోగులు ఇతరుల కంటే తక్కువ చికాకు కలిగించే మచ్చలను కలిగి ఉన్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో కాకుండా ప్రతి రోజు 40 mg కంటే ఎక్కువ జింక్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అధిక మోతాదులో జింక్ తీసుకోవడం వలన కడుపులో అసౌకర్యం, గట్ ఇన్ఫ్లమేషన్​ (ఒక రకమైన పేగు వ్యాధి) కలుగుతుంది. చర్మం జింక్​ను ఎక్కువగా గ్రహించలేకపోవచ్చు. ఇది చర్మంపై ఎటువంటి ప్రభావం చూపదు.

3. తేనె మరియు దాల్చిన చెక్క మాస్క్​ (ముసుగు)

2017లో నిర్వహించిన సర్వే.. తేనె మరియు దాల్చిన చెక్క సారం P. Acnes(ఒక రకమైన మొటిమలు) తో పోరాడుతుందని తేల్చింది. 2020 రీసెర్చి ప్రకారం.. తేనె ఒంటరిగానే మొటిమలను చంపుతుందని తేలింది. దీనర్థం.. తేనె మొటిమలను నయం చేస్తుందని కాదు. 2016 లో 136 మంది మొటిమలతో బాధపడుతున్న వారితో జరిపిన సర్వేలో యాంటీ బ్యాక్టీరియల్ సబ్బు తర్వాత తేనెను ఉపయోగించడం వల్ల మొటిమల చికిత్స మెరుగుపడలేదని గుర్తించారు. తేనె మరియు దాల్చిన చెక్క మొటిమలను తగ్గించవచ్చు. కానీ దీనిపై ఇంకా స్టడీ అవసరం. ముఖాన్ని క్లీన్ చేసిన తరువాత దాల్చిన చెక్క, తేనెల మిశ్రమాన్ని ముఖంపై మాస్క్ లా అప్లై చేయాలి.10 నుంచి 15 నిమిషాల వరకు అలాగే ఉంచండి. ఆ తరువాత మాస్క్​ని కడిగి ఆరబెట్టండి.

4. మచ్చల కోసం టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ అనేది ఆస్ట్రేలియన్ జాతులైన మెలలుకా ఆల్టర్నిఫోలియా నుంచి తీసుకోబడింది. 2018లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం... టీ ట్రీ ఆయిల్ (టీ ట్రీ కిట్) మొటిమలను తగ్గించవచ్చని పేర్కొంది. 2019 జనవరిలో మైనర్​ రీసెర్చ్ నిర్వహించబడింది: మొటిమల కోసం టీ ట్రీ వాడే వినియోగదారులు బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుతున్న వినియోగదారుల కంటే తక్కువ పొడిబారిన చర్మం, చికాకు ఉన్నట్లు గుర్తించారు. వారు ఈ చికిత్సతో సంతోషంగా ఉన్నారు. 2017లో నిర్వహించిన ఒక రీసెర్చ్​లో ఈ విషయాన్ని కనుగొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మొటిమల కోసం వాడే టీ ట్రీ ఆయిల్ బ్యాక్టీరియా నిరోధకతను పెంపొందించే టాపికల్ (చర్మంపై నేరుగా అప్లై చేసే మందులు), ఓరల్ మెడికేషన్స్​ను భర్తీ చేసే అవకాశం ఉంది. మీ చర్మంపై వాడే టీ ట్రీ ఆయిల్​ను ఎల్లప్పుడూ డైల్యూట్ (పలుచగా) చేసి వాడండి. టీ ట్రీ ఆయిల్​ను నీటితో ఎలా కలపాలి. కాటన్ స్వాబ్​ను క్లీన్ చేసి మిశ్రమాన్ని కాటన్ స్వాబ్ సహాయంతో కలపండి. అవసరమనుకుంటే మాయిశ్చరైజ్ చేయండి. · అవసరమైన విధంగా ప్రతి రోజు పునరావృతం చేయండి.

5. మీ స్కిన్​కు గ్రీన్ టీని అప్లై చేయండి..

గ్రీన్​టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది మొటిమలను తగ్గిస్తుంది. 2017లో వెలువరించిన ఒక సర్వే ప్రకారం.. గ్రీన్ టీలోని పాలీఫెనాల్స్ మొటిమలను కలిగించే జెర్మ్స్ (కీటకాలు)ను నిరోధించడంలో సహాయపడతాయి. గ్రీన్ టీ మొటిమలను తొలగించేందుకు సహాయపడవచ్చు. కానీ తదుపరి అధ్యయనం అవసరం. 2016లో జరిపిన ఒక అధ్యయనంలో 80 మంది స్త్రీలు రోజుకు 1,500 mg గ్రీన్ టీ సారాన్ని నాలుగు వారాల పాటు ప్రతి రోజు పొందారు. ఇలా తీసుకున్న తర్వాత.. వారి ముక్కు, చెంపలు, పెదాల మీద మొటిమలు తగ్గినట్లు వారు గుర్తించారు. గ్రీన్ టీ చర్మానికి కూడా మేలు చేస్తుంది. 2020లో నిర్వహించిన సర్వే ప్రకారం... గ్రీన్ టీ మొటిమల సెబమ్​ను తగ్గిస్తుందని విశ్వసనీయ మూలం ప్రకారం చెప్పబడింది. ఇంట్లోనే గ్రీన్ టీ క్రీమ్ లేదా లోషన్ ఉత్పత్తి చేయడం చాలా సులభం. గ్రీన్ టీని 3 నుంచి 4 నిమిషాల వరకు మరిగించాలి. టీని చల్చార్చండి. కాటన్ బాల్ లేదా స్ప్రే బాటిల్ తీసుకుని ఆ టీని అప్లై చేయండి. దాన్ని ఆరనిచ్చి.. తర్వాత కడిగి ఎండబెట్టండి. మీరు తేనె మరియు తే ఆకులను ఉపయోగించి మాస్క్ కూడా తయారు చేయొచ్చు.

ముగింపు:

ఇంట్లో తయారు చేసిన ఫేస్ మాస్క్​లు స్కిన్​ను శుభ్రం చేసి.. మొటిమలను తొలగిస్తాయి. ఇందుకోసం వాడే పదార్థాలన్నీ కిచెన్ మరియు ఫ్రిడ్జ్​ వస్తువులే. మొటిమల బారిన పడ్డ చర్మం కోసం ఇంట్లో తయారు చేసిన ఈ హోమ్ క్యూర్​లు (ఇంటి నివారణలు) ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉపయోగించి మీ చర్మం ఎలా స్పందిస్తుందో చూడండి.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.